బతికి ఉంటే… వైఎస్ ను జైలుకు పంపేవాడే..!

Undavalli-Arun-Kumarదిగవంత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ పై ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. జగన్ కరప్షన్చేయడంలో.. కురవృద్దుడని ఎద్దేవాచేశారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీ జగనేనని… ‘డబ్బు నాదే. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు’ అంటే కుదరదని ఉండవల్లి అన్నారు. రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో బుధవారం నిర్వహించిన తొమ్మిదో వార్షిక నివేదిక సభలో ఉండవల్లి మాట్లాడుతూ.. ‘తప్పు నాది కాదు. కేబినెట్‌ది’ అంటున్న జగన్… వైఎస్ బతికి ఉంటే ఆయనను కూడా జైలుకు పంపించాలని వాదనకు దిగే వాడని విమర్శించారు.

ఎంపీ కాకముందు జగన్ ఆదాయం రూ.77 కోట్లుగా చూపించారు. వైఎస్ మరణానంతరం ఆయన రూ.410కోట్ల ఆదాయాన్ని చూపా రు. దానిపై రూ.87 కోట్లు ఆదాయపు పన్నుకట్టారు. ఈ డబ్బంతా ఎక్కడిది?” ఆయన సూటిగా అని ప్రశ్నించారు. అవినీతితో అందలమెక్కిన జగన్ లాంటివారు.. సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనడంపై ఉండవల్లి మండిపడ్డారు.

ఇది ప్రజాస్వామ్య దేశమని, ఏదైనా చట్టం ప్రకారమే జరుగుతుందని.. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంతూలే
ఇందుకు ఉదాహరణగా వర్ణించారు. అయ్యో పాపం జగన్ ను వదిలేయవచ్చు కదా! అన్న వారూ ఉన్నారు. వైఎస్ కొడుకు కాబట్టి జగన్‌ను వదిలేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” ఉండవల్లి హెచ్చరించారు. అంతేకాకుండా ఈ సభ ద్వారా ఆయన తెరాస అధినేత కేసీఆర్ పై కూడా నిప్పులు చెరిగారు