ఖుషీ సినిమా గుర్తుందా? అందులో పాటల్నీ హిట్టే. దాదాపుగా అన్నీ క్లాస్‌గానే ఉంటాయి. ఒక్క గజ్జెఘల్లు మన్నాదిరో… తప్ప. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో పాటు ఆడి, పాడిన శృంగార తార గుర్తుందా? ఆమే ముంతాజ్. జెమిని సినిమాలో జెమిని జెమిని అంటూ యమ ఫాస్ట్‌గా స్టెప్పులు వేసింది. ఆ తరవాత పెద్ద గా సినిమాలు చేయలేదు. మనవాళ్లూ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమా కోసం వచ్చింది. పవన్- త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం అత్తారింటికి దారేది. ఇందులో ఓ పార్టీ సాంగ్ ఉంది. అందుకోసం ముంతాజ్ని ఎంపిక చేశారు. ఈ పాటలోనే మిర్చి భామ హంసా నందిని కూడా కనిపిచనుంది. ఒకే పాటలో ఇద్దరు ఐటెమ్ గాళ్స్ అన్నమాట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలను ఈనెల 14న విడుదల చేస్తారు.