అవినీతి మంత్రికి మరణశిక్ష..!

TV-grab-of-Liu-Zhijun-at--Lఅవినీతి మంత్రికి ప్రభుత్వం మరణశిక్షను విధించింది.. ! షాక్ అయ్యారా.. మన భారతదేశంలో కాదులేండీ. ప్రపంచం దేశాలలోకెళ్ల అభివృద్ధి పథంలోదూసుకెళుతున్న మన పక్క దేశం అయిన చైనాలో. విషయమేమిటంటే.. చైనాలో అవినీతికి పాల్పడిన లియు ఝిజున్ అనే మాజీ రైల్వేశాఖ మంత్రికి ఆ దేశ ప్రభుత్వం ఉరిశిక్షను విధించింది. 2003 నుంచి 2011 వరకు మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన లియు రూ.64 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా.. తనవారికి దోచిపెట్టడంలో ఈయన ఉదారంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విచారణలో స్పష్టమైంది.

అన్నింటికి మించి ఝిజున్ అవినీతి వలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తేలడంతో ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. లియు కేసునువిచారిస్తున్న బీజింగ్ కోర్టు తాజాగా ఆయనకు ఉరిశిక్ష విధించింది. అంతేగాకుండా జీవితాంతం రాజకీయ హక్కును రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.కాగా, చైనా చట్టాల ప్రకారం మరణశిక్ష ప్రకటించినప్పుడు దాని అమలును రెండేళ్ళు వాయిదావేస్తారు. ఆ వ్యవధి ముగిశాక సమీక్ష చేపడతారు.

ఛైనా ప్రభుత్వంలా.. మనదేశంలోనూ ఇలాంటి చట్టం అమలుపరిస్తే.. ప్రస్తుతం రాజకీయాలు చేయడానికి రాజకీయనాయకులు వుండరనడం అతిశయోక్తి కాదేమో.. ఎందుకంటే మన దేశంలో దేశ ప్రధానితో పాటుగా, మంత్రులు, ఎమ్మెల్యేలు.. చోటామోటా లీడర్లు అందరిపైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం సహజమే కదా!ఒకవేళ కుంభకోణంలో దోషులుగా తేలినా.. సంవత్సరాలు-సంత్సరాలుగా జైలులో సర్వభోగాలు ఏర్పటుచేసి మరి కాపాడుతుంది మన ప్రభుత్వం. అందుకే మనదేశంలో అవినీతికి పాల్పడని రాజకీయలంటే అదో క్రేజీ మరీ. లక్షల కోట్లు ప్రజా సొమ్మును అక్రమార్జన ద్వారా సంపాదించిన నేతలను మన ప్రజలు సైతం గుండెల్లో పెట్టుకొని మరి ఓట్లు వేస్తారు. అందుకే అవినీతిని అంతమొందించడంలో మన పక్క దేశమైన చైనాను చూసి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి.