ర‌వితేజ‌ని దెబ్బకొట్టిన సూర్య

surya-ravi-tejaబ‌లుపు చూపించి ఎన్నాళ్లకో ఓ హిట్ అందుకొన్నాడు ర‌వితేజ‌. ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చినా మార్కెట్‌లో మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో – బ‌లుపు థియేటర్లు ప్రేక్షకుల‌తో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలివారం ఈ సినిమా రూ.16 కోట్లు వ‌సూలు చేసింది. రెండో వారం కూడా ఈ సినిమా అదే రేంజులో వ‌సూళ్లు కొల్లకొడుతుంద‌ని అనుకొన్నారు. అయితే సూర్య సింగంలా వ‌చ్చి బ‌లుపు వ‌సూళ్లకు చెక్ పెట్టాడు. ఈ శుక్రవారం నుంచి బ‌లుపు వ‌సూళ్లు భారీగా ప‌డిపోయాయి. కార‌ణం.. సూర్య సినిమానే. మాస్‌, యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండ‌డంతో పాటు, సూర్యకి తెలుగు ప్రేక్షకుల‌లో ఉన్న క్రేజ్ వ‌ల్ల సింగం – బ‌లుపుకి పోటీకి దిగింది. దాంతో బ‌లుపు వ‌సూళ్లు మ‌రీ దారుణంగా ప‌డిపోయాయి. సింగం వచ్చాక బ‌లుపుకి కేవ‌లం 40 % వ‌సూళ్లు మాత్రమే వ‌స్తున్నాయ‌ట‌. దాంతో ర‌వితేజ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది.