మొత్తానికి బాలయ్యకు ఓ హీరోయిన్ దొరికింది. రెయిన్బో కథానాయిక సోనాల్ చౌహాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఇంకెవరూ లేనట్టు ఓ ఫ్లాప్ హీరోయిన్ ని వెదికి పట్టుకొచ్చారు.. రూలర్ సినిమాకోసం. దక్షిణాదిన ఇంతమంది కథానాయికలు ఉండగా, బాలయ్య పక్కన సోనాలీనే దొరికిందా..? అని నందమూరి ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇంతకు ముందు కూడా చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ తరవాత.. వాళ్లంతా సైడ్ అయిపోయారు. దాంతో సోనాలి అయినా ఉంటుందా? అందరిలానే తూచ్చెబుతుందా? అనే ఇంకో అనుమానం మొదలైంది. ఈనెల 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈలోగా నాయిక పేరు మారినా మారొచ్చు!