సింగం హిట్ టాక్‌..!

singamసింగం.. పేరు కాదు, బ్రాండ్ అనే విష‌యం మ‌రోసారి రుజువైంది. సింగం క‌థ అన్నీ భాష‌ల్లోనూ హిట్టే. అందుకే సీక్వెల్ ఆలోచ‌న వ‌చ్చింది. ఈసారీ ఈ సింగం గ‌ర్జించింది. తొలి రోజు అనూహ్యమైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. పాజిటీవ్ టాక్ రావ‌డంతో.. శ‌ని, ఆది వారాలూ హౌస్‌ఫుల్స్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌జిని త‌ర‌వాత సూర్యకి తెలుగులో మార్కెట్ మొద‌లైంది. అయితే ఆ స్థాయి విజ‌యం అందుకోలేక‌పోయాడు. త‌మ్ముడు కార్తి విజృంభించి హిట్టు కొట్టాడు. య‌ముడుతో సూర్య మళ్లీ పోటీకి వ‌చ్చాడు. ఇప్పుడు.. రెండో భాగం కూడా సూర్యకు ఓ మంచి విజ‌యాన్ని అందించిన‌ట్టైంది. సినిమా మ‌హా స్పీడుగా ఉంద‌ని, మాస్‌ కి బాగా నచ్చేస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే హరి టేకింగ్ క్లాస్ కీ న‌చ్చే ఛాన్స్ ఉంద‌ట‌. అదే జ‌రిగితే య‌ముడుకి మించిన హిట్ అందుకోవ‌డం ఖాయం.