మరోసారి వేడెక్కిన
తెలంగాణ నినాదం !
సర్కారీ పెద్దలకిది
కాకూడదు వినోదం !!
ఏదో ఒక నిర్ణయాన్ని
ప్రకటిస్తే సుఖాంతం !
నాన్చివేత ధోరణితో
సాగతీత దుఃఖాంతం !!
స్టేటు వెనుకబడుతోందీ
ఉద్యమాలు ఉధృతం !
డెసిషన్ లేటయ్యిందో
పొజిషనింక వికృతం !!
ఎందుకు లేటవుతుందో
సోనియమ్మకే తెలుసు !
ఇది ఇలాగ కొనసాగితె
జాతి కంట నలుసు !!
– ఏవీయస్