గొంతులో కిచ కిచ … !

మంత్రి పదవి రాగానే
మారినావు కావూరీ !
సమైక్యాంధ్ర గావుకేక
మారిందట పొగచూరీ !!

అంత తేలికా బ్రదరూ
మాట మార్చు ముచ్చట !
నరంలేని నాలుకలట
వినువాడికి పిచ్చట !!

అలిగినావు ఆ నాడూ
ఏమయింది సాంబశివా !
బలుపు కారు రాగానే
గొంతులోన కువ కువా !!

పదవి కొరకు రాజీపడు
వ్యక్తిత్వం అసహ్యం !
ఈ తరహా రోగాలకు
వాడాలోయ్ సరి లేహ్యం !!

– ఏవీయస్