అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం కెవ్వు కేక. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించారు. భీమ్స్ – చిన్ని చరణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని నరేష్ మాతృమూర్తి సరస్వతి ఆవిష్కరించారు. శ్రీహరి, పోసాని. బి.గోపాల్, మారుతి, శ్రీకాంత్, వీరభద్రమ్, ఉదయ్‌కిరణ్, సందీప్ కిషన్, ఆర్యన్ రాజేష్, డి.రామానాయుడు, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ”నా జీవితంలో నిజమైన హీరో మా నాన్నగారే. ఇప్పుడు మా అన్నయ్య ఆర్యన్ రాజేష్ హీరో. ఈ పాటల వేడుకకు మా అమ్మ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. 2002లో పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచీ అందరూ నాకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో నామిత్రులందరూ ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంద”న్నారు. ”బ్లేడ్ బాబ్జీ తరవాత మా కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. తప్పకుండా కేక పెట్టిస్తుంది” అని దర్శకుడు చెప్పారు.