చిత్ర పరిశ్రమ స్పందించదేం !!

tollyదేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా, వైపరీత్యాలు జరిగినా మానవతాదృక్పధంతో సహాయ హస్తం అందించటంలో తెలుగు చిత్ర పరిశ్రమ ముందుండటం ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది.దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు దగ్గరనుంచీ ఇలా స్పందించటం ఆనవాయితీగా మారింది. నాలుగేళ్ళక్రితం కూడా దర్శకుడు దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు పెద్ద ఎత్తున పరిశ్రమ నిధులు సమకూర్చి పెట్టింది. ఈ విషయంలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ ఈ కార్యక్రమానికి మూలస్థంభంగా నిలిచి అందరి
ప్రశంసలు చూరగొన్నారు.

అయితే ఇటివలి ఉత్తరాఖండ్ బీభత్సం విషయంలో మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందన దారుణం. ఏతా వాతా ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం తనవంతుగా 20 లక్షలు విరాళం ప్రకటించి హిరోలందరికీ ఆదర్శంగా నిలిచారు. మహేష్ బాబు అయితే 50 లక్షలదాకా సహాయం ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి అయితే అది అధికారికంగా ధృవీకరణ కాలేదు. అది మినహా ఫిలిం చాంబర్ గాని, నిర్మాతల మండలి గాని, మూవీ ఆర్టిస్టుల సంఘం గానీ, వర్కర్స్ ఫెడెరేషన్ గాని ఈ విషయమై స్పందించకపోవటం బాధాకరం. కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చిత్రపరిశ్రమ స్పందించాలి అంటూ పిలుపు ఇచ్చినా ఫలితం లేకపోయింది. మెగా ఫ్యామిలీ లో కూడా ఏ హీరో సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. చిరంజీవి పిలుపు ఇచ్చే సమయానికే పవన్ కళ్యాణ్ తనవంతుగా స్పందించారు. నూరేళ్ళ భారతీయ సినిమా వేడుకలను భారిగా జరిపేందుకు ఊపిరాడకుండా ఏర్పాట్లు చేస్తున్న దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య కూడా ఈ దిశగా అసలు ఆలోచించటం లేదు. సో…. పిటీ !!