బాహుబ‌లికి… ఆదిలోనే అపశృతి

ranaబాహుబ‌లి సినిమా న‌త్తన‌డ‌క న‌డ‌వ‌డం మాట అటుంచితే – ఈ సినిమాకి ఆదిలోనే అపశృతి ఎదురైంది. ప్రభాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని త‌న పాత్ర కోసం రానా గుర్రపు స్వారీ నేర్చుకొంటుండ‌గా చిన్న ప్రమాదం సంభ‌వించింది. గుర్రంపైనుంచి రానా ప్రమాద‌వ‌శాత్తూ కింద ప‌డ‌డంతో త‌ల‌కు చిన్న గాయం అయ్యింది. వెంట‌నే రానాని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయాలు చిన్నవే అని, పెద్దగా భ‌య‌పడాల్సింది ఏమీ లేద‌ని డాక్టర్లు తేల్చడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకొంది.