స్థానిక ఎన్నికల ఖర్చు 160 కోట్లు!

ramakanthరానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసు అధికారులతో శాంతిభద్రతల అంశంపై చర్చించామని, 64 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని రమాకాంత్ తెలియజేశారు. అయితే, ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే 104 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రమాకాంత్ చెప్పుకొచారు. కాగ, రేపు ఉదయం 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు కమిషనర్ తెలిపారు.