ట‌వ‌ర్ స్టార్‌.. ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌ర్ స్టార్‌!!

nagababu-pavankayanత‌మ్మడు ప‌వ‌న్‌ని అంద‌రూ వాడుకొంటున్నారు, నేను వాడుకొంటే త‌ప్పేమిటి?? అనుకొంటున్నాడేమో నాగ‌బాబు. ప‌వ‌న్ పేరుని, క్రేజ్‌ని త‌న వంతుగా పిండేయ‌డానికి రంగంలోకి దిగిపోయాడు. తేజ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న 1000 అబ‌ద్ధాలు సినిమాలో నాగ‌బాబు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో నాగ‌బాబు ట‌వ‌ర్ స్టార్ గా కనిపించ‌బోతున్నాడు. ట‌వ‌ర్ స్టార్ – ఫ్యాన్ ఆఫ్ ప‌వ‌ర్ స్టార్ అంటూ 1000 అబ‌ద్ధాలులో ఓ డైలాగ్‌ కూడా చెప్పాడు నాగ‌బాబు. ప‌వ‌న్ ఫ్యాన్ గా ఈ సినిమాలో ఆయ‌న మెగా అభిమానుల‌కు వినోదం పంచ‌బోతున్నాడ‌ట‌. మరి.. ఆ క్యారెక్టర్ ఏ రేంజులో ఉంటుందో చూడాలంటే, జులై రెండో వారం వ‌ర‌కూ ఆగాలి. ఎందుకంటే – ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది.