బ‌లుపు సెన్సార్ రిపోర్ట్ ఏమిటి?

balupuవినోదం, యాక్షన్‌…. ఇవి రెండూ క‌ల‌గ‌లిపిన క‌థ‌లకు స‌రిగ్గా ప‌డిపోతాడు ర‌వితేజ‌. ఆయ‌న్నుంచి స‌రిగ్గా ఇలాంటి కొల‌త‌ల‌తోనే ఓ సినిమా వ‌స్తోంది. అదే బ‌లుపు. ర‌వితేజ‌ను డాన్ శీనుగా చూపించిన గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఈ చిత్రానికి సోమ‌వారం సెన్సార్ జ‌రిగింది. సెన్సార్ వాళ్లు U/A స‌ర్టిఫికెట్ జారీ చేశారు. అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. తెలుగు మిర్చి సేకరించిన సెన్సార్ రిపోర్ట్ ఇదీ..

* ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సాగే సినిమా ఇది. ఓ ఫ్లాష్‌బ్యాక్‌, ఓ పాట, ఫైటూ, కామెడీ ట్రాక్ – ఇలా ర‌వితేజ సినిమాలు గ‌తంలో ఏ ఫార్మెట్‌లో సాగాయో ఇది కూడా అలానే న‌డుస్తుంది.

* అయితే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని మేళ‌వించిన విధానం త‌ప్పకుండా న‌చ్చుతుంద‌ట‌. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం-శ్రుతిహాస‌న్ ల మ‌ధ్య న‌డిచే కామెడీ ట్రాక్ ఈ సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ అని తెలుస్తోంది.

* ఓ పాట‌లో శ్రుతి… హాట్ హాట్‌గా అందాలు ఆరేసింద‌ట‌. ఈ సినిమా ఆమెకు గ్లామ‌ర్ డాల్ గా కొత్త ఇమేజ్ తీసుకొస్తుంద‌ని చెబుతున్నారు.

* ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే స‌న్నివేశాల్లో అంజ‌లి క‌నిపిస్తుంది. ఆస‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్ గా తీశార‌ట‌.

* త‌మ‌న్ పాట‌లు ఎప్పటిలానే ఓ మోస్తరుగా ఉన్నా వాటిని చిత్రీక‌రించిన విధానం మాత్రం రిచ్‌గా ఉంద‌ట‌.

* కోన వెంక‌ట్ అండ్ కో రాసిన సంభాష‌ణ‌లు, సెట్యువేష‌న్ కామెడీ బాగా వ‌ర్కవుట్ అయ్యింద‌ట‌.

* ర‌వితేజ రెండు ర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపించ‌నున్నాడు. అవి ఈ క‌థ‌లో కీల‌కం.

* సెకండాఫ్ ప్రథ‌మార్థం కాస్త స్లో అయ్యింద‌ట‌. మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల్లో సినిమా జోరందుకొంది.

* ఈ సినిమాకి ఎంటర్‌టైన్‌మెంటే దిక్కు. వాటిని ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తారు అనేదానిమీదే ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉన్నాయి అనేది సెన్సార్ టాక్‌.