డీఎస్ తో సమావేశమయిన కోదండరాం !

Kodandaramపీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొ. కోదండరాం సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్ చర్చలు జరిపారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఢిల్లీలో తాజాగా చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో పాటుగా, త్వరలో రాజకీయ పార్టీలతో రాజధానిలో ఐకాసనిర్వహించనున్న జాతీయ సెమినార్ అంశంపై డీఎస్ తో ఐకాస నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ బేటీలో కోదండరాంతో పాటుగా ఐకాస నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.