అక్కినేని హీరోతో మారుతి!

maruthi-sushanth-movieత‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా తీసి – హిట్లు కొట్టేస్తున్నాడు మారుతి. అత‌నితో సినిమాలు చేయ‌డానికి ఓమాదిరి హీరోలు, నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడాయ‌న శిరీష్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈలోగా మరో న‌ట వార‌సుడితో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అక్కినేని హీరో సుశాంత్‌, మారుతి క‌లిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విష‌యాన్ని మారుతి స్వయంగా ధృవీక‌రించాడు. కొత్త జంట పూర్తయిన త‌ర‌వాత‌.. మారుతి టేక‌ప్ చేసే సినిమా ఇదే కావ‌చ్చు. సుశాంత్ సినిమా అడ్డా త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.