శ్వేతా భ‌ర‌ద్వాజ్ అద‌ర‌గొట్టింది!

Shewatha-Bharadwaj-in-addaవి వాంట్ బ్యాడ్ బోయ్స్ అంటూ – బిజినెస్‌మేన్‌లో హంగామా చేసింది.. శ్వేతా భ‌ర‌ద్వాజ్‌. ఇప్పుడు అడ్డాలోనూ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చిందులు వేయ‌నుంది. కెమెరా ముందే కాదు.. ఆ పాట‌ని లైవ్‌గా పెర్‌ఫామ్ చేసింది ఈ ఐటెమ్ గాళ్‌. సినిమాలో ఏ రేంజులో ఉంటుందో తెలీదుగానీ – స్టేజ్ మీద ఓ ఊపు ఊపేసింది. ఆమె చేసిన‌ ఎక్స్‌పోజింగ్… ఓ రేంజ్‌లో ఉంది. మరి తెర‌పై ఎంత మ‌సాలా ద‌ట్టించిందో…? డాన్స్ చేయ‌డం ఒక్కటే కాదు, వేదిక‌పై యాంక‌ర్ అవ‌తారం ఎత్తి, నాగార్జున‌ని ఓ మినీ ఇంట‌ర్వ్యూ చేసింది. చిత్రసీమ‌లో నిల‌బ‌డిపోయే టెక్నిక్కులు భ‌లే ప‌ట్టేసినట్టుంది.