శివాజీ, రోబో – రజనీకాంత్, శంకర్ కలయికలో వచ్చిన సినిమాలివి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. రజనీ-శంకర్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే వీరిద్దరి మధ్య పలుమార్లు కథాచర్చలు జరిగాయట. శంకర్‌తో మరోసారి జట్టు కట్టడానికి రజనీ కూడా తన సంసిద్ధత వ్యక్తం చేశాడని సమాచారమ్.
అయితే ఇది భారతీయుడు 2 అనే వర్తలూ వినిపిస్తున్నాయి. భారతీయుడు సినిమాకి సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో శంకర్ భావిస్తున్నాడు. అయితే అది రజనీతో టేకప్ చేయాలని ఆయన ప్లాన్. ఇప్పుడు అదే కథని రజనీతో తెరకెక్కిస్తాడని తమిళ సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. ప్రస్తుతం శంకర్ ఐ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాకే రజనీ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.