రూపీ మరింత దివాళ !

rupeeఅంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుంది. ఈరోజు రూపాయి అత్యంత కనిష్ఠస్థాయికి దిగజారింది. ఈరోజు ఒక్కరోజే ఒకేసారి 130 పైసలు పతనమైన రూపాయి డాలర్ తో పోలిస్తే 59.94 పైసలు.. అంటే 60 రూపాయలకు పడిపోయింది. ఇటీవల కాలంలో దేశంలోఎదురవుతున్న దీర్ఘకాలిక సంఘటనలే ఈ పతనానికి కారణమని ఆర్ధికమంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే రూపీ విలువ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.