కస్టడీపై విచారణ 25కి వాయిదా

Sabitha-Dharmanaమాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన సీడీ అస్పష్టంగా ఉందని, ఒరిజినల్ సీడీలను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ మెమోలో కోరారు.

ఒరిజినల్‌ సీడీ సమర్పించాకే జ్యుడిషియల్‌ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాన, సబిత మెమోలో కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ధర్మాన, సబిత జ్యుడిషియల్‌ కస్టడీపై తదుపరి విచారణ 25కు వాయిదా పడింది.

రాజీనామా లేఖలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వీడియో అస్పష్టంగా వుందని, ఆ వీడియో ఎడిట్ చేసి ఉండకూడదని ఈ మాజీ మంత్రులు అంటున్నారు. అయితే ఈ వాదన పై సీబీఐ స్పందిస్తూ.. తాము ఆ వీడియోను యూట్యూబ్ నుంచి సేకరించామని కోర్టుకు తెలిపింది.