పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి సీక్వెల్గా ‘గబ్బర్ సింగ్-2′ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ దాదాపు ఖరారైంది. ఈ చిత్రంలో పవన్ సరసన నటించే లక్కి ఛాన్స్ బాలీవుడ్ బబ్లీ గర్ల్ సోనాక్షి సిన్హా కొట్టేసిందని సమాచారం. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపాడట దర్శకుడు సంపత్ నంది. రెమ్యూనరేషన్, డేట్లు ఖరారయితే త్వరలోనే సోనాక్షి పేరును అధికారంగా ప్రకటించేస్తారని సమాచారం. త్రివిక్రమ్ సినిమా విదేశీ షూటింగ్ ముగిసిపోతే పవన్ గబ్బర్ సింగ్-2′ పై దృష్టిపెడతారు. దబాంగ్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకున్న సొగసరి సోనాక్షి సిన్హా ఇప్పుడు గబ్బర్ సింగ్-2 తో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కనువిందు చేయనుందన్న మాట.