ప్రధాని ప్రమాణ స్వీకారం !

manmohanరాజ్యసభ సభ్యుడిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈరోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ తన ఛాంబర్ లో ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే అసోం నుంచి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభ్యడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, అసోం నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం విశేషం. ప్రధానితో పాటుగా అసోమ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన మరో కాంగ్రెస్ సభ్యుడు సెంథియస్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.