ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రుహాని

ruhani (1)ఇరాన్ నూతన అధ్యక్షుడిగా హసన్ రుహానీ ఎన్నికయ్యారు. దేశంలో ప్రైవేటు సంస్థల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తామని, మీడియాపై నిర్భందం తొలగిస్తామని..అంతర్జాతీయ ఆర్ధిక ఆంక్షల తొలగింపుకు కృషి చేస్తామని రుహానీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రుహాని 50.7 శాతం ఓట్లతో విజయం సాధించారు. 1989 సంవత్సరం నుండి దేశ అత్యున్నత మత నాయకుడిగా కొనసాగుతున్న ఖమైనీ ఈసారి విమర్శలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించారు.

సంస్కరణల వాదిగా ముద్రపడిన రుహానీ ఎన్నికకావడం వల్ల ఆ దేశంలో మరింత ప్రైవేటీకరణ జరిగే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా, ఖమైనీని కాదని అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదని, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా ఆ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని మరో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను తాము గుర్తించడం లేదని అగ్రరాజ్యం అమెరికా ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.