కాలయాపన చేస్తే.. కాంగ్రెస్ ఖతం !

harish-raoమరోసారి అఖిలపక్ష సమావేశం ఉండదన్న షిండే.. మళ్లీ అఖిలపక్ష ఏర్పాటుపై లీకులివ్వడాన్ని నమ్మే ప్రసక్తే లేదని, కేంద్రం ఇచ్చే ఏ ప్యాకేజీకి ఒప్పుకునేది లేదని తెరాస సీనియర్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలను అవమానపర్చినట్లే.. కమిటీలతో కాలయాపన చేస్తే కాంగ్రెస్ ఖతం అవుతుందని అన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ ఎన్ని జిమ్మికులు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. వలసలను ఆపడానికి కాంగ్రెస్ ఆరాటపడుతుందని హరీష్ అన్నారు. కాగా,  గత సంవత్సరం డిసెంబర్ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో.. “అఖిల పక్ష సమావేశం” నిర్వ్హహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తెలంగాణ విషయంలో ఇదే ఆఖరి అఖిలపక్ష సమావేశమని కూడా ఆయన స్పష్టం చేశారు.