వేడెక్కిన ఉస్మానియా !

ou-studentsతెలంగాణ రాజకీయ జేఏసీ రేపు తలపెట్టిన “చలో అసెంబ్లీ” నేపథ్యంలో.. ఉస్మానియా యూనివర్శిటీ ఒక్కసారిగా వేడెక్కింది. “ఛలో అసెంబ్లీ” అనుమతి ఇవ్వాలంటూ.. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను
పోలీసులు ఎన్  సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఓ దశలో బాష్పవాయివు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం
చేశారు.

అయితే, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రాజకీయ పార్టీ.. ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఓయూలో వాతావరణం వేడెక్కడం సర్వసాధారణమయిపోయింది. ఓ విధంగా తెలంగాణ ఉద్యమ తీవ్రత ఖచ్చితంగా తెలుసుకోవాలంటే.. ఓయూ వాతావరణం చూడాలంటారు. కాగా, “ఛలో అసెంబ్లీ” లాంటి కార్యక్రమాలలో పాల్గొని వారి భవిష్యత్ ను పాటు చేసుకోవద్దని నగర సీపీ అనురాగ్ శర్మ నిన్న (బుధవారం) విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.