టెలిగ్రామా’.. ఇక సెలవు..!

bsnl-decides-to-stop-telegrబంధువుల యోగ క్షేమాలను చేరవేయడానికి మనకున్న ఏకైక సాధనం ‘టెలిగ్రాం’  ఇది  ఒక్కప్పటి మాటండీ బాబూ.. !. అప్పట్లో పోస్ట్ మ్యాన్ ‘ఆ పోస్ట్.. పోస్ట్’  అంటే చాలు ఊరిలో ప్రజల్లో కొందరు సంతోషంతో బంధువుల నుంచీ క్షేమ సమాచారం  కోసం వేచిచూస్తే.. మరికొందరు ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని ఓ విధమైన  ఉత్కంఠతో ఎదురుచూసే వారు. ఇక పిల్లల సంగతి సరే సరి పోస్ట్ మాన్ చుట్టు  గుమిగూడి.. అల్లరల్లరితో చెలరేగిపోయేవారు. వారి మోహాలను చూస్తుంటే.. మాకేమైనే టెలిగ్రాం వచ్చిందా అంకుల్ అన్నుట్టుండేవీ మరీ.

ఇప్పుడు పరిస్థితి మారింది..  కాలం గిర్రున తిరిగి ఆత్యాధునికమైన సమాచార  వ్యవస్థ మనకు అందుబాటులోకి వచ్చింది. దీంతో.. క్రమంగా టెలిగ్రాం అనే మాట  వినడమే దాదాపు తగ్గిందనే చెప్పాలి. మొబైల్ ఫోన్ లతో పాటుగా, మారుమూల  గ్రామాలలో సైతం ఇంటర్ నెట్ వ్యవస్థ విస్తరించిపోయింది. దీంతో.. దేశీయంగా  ఎటువంటి డిమాండ్ లేకపోవడంతో ఇక టెలిగ్రాం సర్వీస్ ను నిలుపుదల చేయడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.

దాదాపు 160 సంవత్సరాల వయస్సున్న ఈ ‘టెలిగ్రామ్’ తన ప్రయాణానికి ఇక ఫుల్  స్టాప్’ పెట్టనుంది. వచ్చే నెల జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా వీటి బుకింగ్  లను నిలుపుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయినట్లు ఢిల్లీ హెడ్ ఆఫీస్ అన్ని శాఖలకు ఆర్డర్లు పాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్,  చాటింగ్, ఎస్ ఎంఎస్ లకు బాగా డిమాండ్ వుండడంతో.. ఈ వృద్ధ ‘టెలిగ్రామ్’  అనే పదాన్ని దేశం మొత్తం దాదాపు మరచిపోట్లయింది. ఇప్పటి పిల్లలకు టెలిగ్రామ్ అంటే  కూడా తెలియదంటే అతిశయోక్తి దాదేమో..! ఎందుకంటే చిన్న పిల్లలు సైతం
ఇప్పుడు మొభైల్ ఫోన్ లను ఓ ఆటాడేసుకుంటున్నారు కదా..!

ఇక కొద్దిరోజుల్లో  సెలవుతీసుకోనున్న ఈ టెలిగ్రామ్ చరిత్రను ఒక్క సారి  పరిశీలిస్తే.. అమెరికాకు చెందిన శామ్యూల్ మోర్స్ 1837లో ఎలక్ట్రికల్  టెలిగ్రామ్ ను కనిపెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికాలో తొలి  టెలిగ్రామ్ ను 1838 జనవరి 11న మూడు కిలోమీటర్ల దూరానికి ప్రయోగాత్మకంగా  తొలి టెలిగ్రామ్ ను పంపారు. అది సఫలీకృతం కావడంతో..  టెలిగ్రామ్ ప్రపంచ  వ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా అతి తక్కువ కాలంలోనే అందరి అత్యంత ప్రజాదరణ కూడా పొందింది.

ఇనాళ్లు మనుషులకే కాలం చెల్లుతుందనుకున్నా.. కానీ మనుషులు కనిపెట్టిన టెలిగ్రామ్ లాంటి సాధనలకు కూడా అది వర్తిస్తుందని.. టెలిగ్రామ్ ను  ఆస్వాదించిన ఆ నాటి కాలం నాటి ఓ పెద్దమనిషి మాట వింటే.. టెలిగ్రాం ఎంతగా  ప్రజాధారణ పొందిందో అర్థమవుతుంది. ‘టెలిగ్రామా.. ఇక గుడ్ బై.