నిరుద్యోగుల్ని నిర్మూలిస్తారా ?


Sharmila  ” మరో ప్రజా ప్రస్తానం ” పేరిట వై ఎస్ జగన్ మోహనరెడ్డి సోదరి షర్మిల జరుపుతున్న యాత్రలో ఆమె చేస్తున్న ప్రసంగాలు హాస్య రస స్ఫోరకంగా వున్నాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో ఈ సాగుతున్న ఈ యాత్రలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రసంగాలలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగభ్రుతి ఇస్తానంటున్నారని, అదే జగనన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అసలునిరుద్యోగులు అనేవారు లేకుండా చేస్తారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తలో రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు గుప్పించారని ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ఆమె అన్నారు.  కిరణ్ మాటలు కోతలు దాటుతాయనీ, చేతలు మాత్రం గడప దాటవని షర్మిల ఎద్దేవా చేసారు.