రాబోయే ఎన్నికలలో సినిమా వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు కె పి రెడ్డయ్య అన్నారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ సినిమా వాళ్లకు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండదని, రాజకీయాలలో నిజాయితీ ఉండదని అన్నారు. ఇందుకు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు పై సి బి ఐ దాడులు జరగటమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇవాళ దాసరి నారాయణరావు వంతు పూర్తయిందని, రేపో మాపో కేంద్రమంత్రి చిరంజీవి వంతు కూడా రావచ్చునని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల ప్రజలు అవస్తల పాలవుతున్నారని ఆయన విమర్శించారు.