‘రూపీ’కి రెక్కలొస్తున్నాయి.. !

rupee-అంతర్జాతీయ మార్కెట్ లో ‘రూపాయి’ పతనానికి ఎట్టకేలకు ఈరోజు (బుధవారం) బ్రేక్‌ పడింది. ఈ రోజు ఉదయం 20 పైసల లాభంతో ప్రారంభమై రూపాయి, ప్రస్తుతం 14 పైసల లాభంతో.. 58 రూపాయల 25 పైసల వద్ద ట్రేడవుతోంది. దీనికి కారణం ఇతర ఆసియా కరెన్సీలు లాభపడటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా,
ద్రవ్యోల్బణం గణాంకాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలు రూపాయిపై ప్రభావంచూపుతాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఎగుమతిదారులు.. తమ వద్ద ఉన్న డాలర్లను అమ్మాలని రిజర్వ్‌ బ్యాంకు సూచించింది. ఎగుమతి చేసే కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా విదేశాల నుంచి దేశంలోకి తీసుకువచ్చే డాలర్ల పరిమితిని ఆర్‌ బీఐ పెంచింది. తాజాగా, ఆర్ బీఐ చేపట్టిన చర్యలతో రూపాయి కొంత కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు.