మనోజ్ తో రెడీ అంటున్నాడు

manoj-nageshwar-reddyమంచు విష్ణుతో తో  ‘దేనికైనా రెడీ’ చిత్రాన్ని తెరకెక్కించి, మంచి విజయాన్ని అందుకున్న జి. నాగేశ్వర్ రెడ్డి ఇప్పుడు మంచు మనోజ్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎల్లో ఫ్లవర్స్  బేనర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 9న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాఫ్ లో పూర్తి వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఇది అందరికీ నచ్చుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.