ప్రేమ‌క‌థాచిత్రమ్ @ 17.5 కోట్లు

prema-katha-chitramకృష్ణ అల్లుడు సుధీర్‌బాబు న‌టించిన చిత్రం ప్రేమ‌క‌థాచిత్రమ్‌. మారుతి ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ‌లో తీసిన సినిమా ఇది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకి మంచి టాకే వ‌చ్చింది. వ‌సూళ్లు కూడా బాగున్నాయ్‌. 1.75 కోట్లతో తీసిన ఈ సినిమాకు 17.5 కోట్లు వ‌స్తాయ‌ట‌. ఇది మేం చెబుతున్న లెక్కలు కాదు. స్వయంగా సూప‌ర్ స్టార్ కృష్ణ చెబుతున్నారు. అల్లుడి సినిమా ప్రమోష‌న్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. “ఈ సినిమా పెట్టబ‌డికి ప‌దింత‌ల లాభం వ‌స్తుంది“ అని జోస్యం చెప్పారు. కృష్ణ ఏదో ఫ్లో లో అనేశారు గానీ, ఈ సినిమాకి అంత సీను లేద‌నే విష‌యం అంద‌రికీ తెలుసు. చిత్రసీమ లెక్కల ప్రకారం ఈ సినిమా రూ.6 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ట‌. ఆ మాత్రం తెచ్చుకొన్నా ఇది సూప‌ర్ హిట్ కిందే లెక్క‌!