మరిక చాన్సు లేనట్లేనా?

soniya gandhiకేంద్ర మంత్రివర్గ విస్తరణ దగ్గర కొచ్చేసినట్లు వార్తలు అందుతున్నాయి. దీన్ని విస్తరణ అనే కన్నా ఖాళీలు నింపడడం, కాస్త అటు ఇటు మార్చడం అనవచ్చు. ఈసారి ఈ మార్పులు చేర్పుల్లో మన రాష్ర్టానికి అంతగా ప్రమేయం వుండకపోవచచ్చు అని తెలుస్తోంది. ఆ మధ్య జరిగిన విస్తరణలో మన రాష్ట్రానికి పెద్ద పీట వేయడం, ఈసారి అంత అవకాశం ఇవ్వాల్సిన జనం ఎవరూ లేకపోవడం వల్ల మన రాష్ర్టంపై పెద్దగా దృష్టి సారించే అవకాశం లేదు. తెలంగాణా ఉద్యమవేడిని చల్లార్చేందుకు కూడా ఇప్పుడు ఏమీ చేసేందుకు పెద్దగా లేదు. ఒకవేళ ఆ ప్రాంతానికి చెందిన వారికి ఎవరినైనా పదవిలోకి తీసుకుంటే, టిఆర్ఎస్ లోకి వెళ్లిన వాళ్లకి, వెళ్లే ఆలోచన వున్న వాళ్లకి కాస్త పాఠం చెప్పినట్లు అవుతుంది. అయితే అదీ పెద్ద ముఖ్యమైన పనిగా కాంగ్రెస్ అధిష్టానం భావించడం లేదు. ఇక రాయలసీమ, ఆంధ్రలో మంత్రి పదవుల కోసం గోలపెట్టేంత, పైరవీలు చేసేంత మొనగాళ్లు కూడా పెద్దగా కానరావడం లేదు. అందుకే కావచ్చు మన వాళ్లు ఈ విస్తరణపై అంతగా దృష్టి పెట్టలేదు. లేకుంటే ఈ పాటికి ఢిల్లీ ఆంధ్రభవన్ మన రాజకీయనాయకులతో కిటకిటలాడుతుండేది.