హస్తినలో.. జానా రాజకీయం !

janareddyకాంగ్రెస్ సీనియర్ నేత, పంచాయితీ రాజ్ మంత్రి కె. జానారెడ్డి హస్తినలో.. అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీ అవుతూ బిజిబిజీగా ఉన్నారు. రాష్ట్ర్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయపరిణామాలతో జానా రెడ్డికి అధిష్టానం వద్ద మరింత ప్రాధాన్యత పెరింగిదనే చెప్పాలి. ఎందుకంటే.. తాజాగా రాష్ట్ర్రంలో చోటు చేసుకున్న మూడు అంశాలు కూడా జానాకు సంబంధం ఉన్నవే. అందులో మొదటిది తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడిగా టీ-కాంగ్రెస్ ఎంపీలు తెరాసలోనికి జంప్ కావడంపై అధిష్టానంతో చర్చించడం. రెండోవది పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా.. త్వరలో నిర్వహించబోయే పంచాయితీ రాజ్ ఎన్నికలు ఇక మూడో విషయానికి వస్తే.. కిరణ్ మంత్రివర్గం నుండి మంత్రి డీఎల్ ను బర్తరఫ్ చేయడం.

డీఎల్ విషయంలో..  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ మంత్రుల్లో జానారెడ్డి ఒకరు. ఇలా పై మూడు అంశాలకు సంబంధించి జానా అధిష్టానానికి.. అభిప్రాయాలు, వివరణలు, ఫిర్యాదులు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, జానా, ఎంపీ రాజయ్యతో కలసి ఈ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్తో భేటీ అయ్యారు. అనంతరం మరికొంత మంది అధిష్టాన పెద్దలతో జానా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. హస్తినలో జానా రాజకీయంతో రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఉత్కంఠ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.