అది తిరుప‌తి ల‌డ్డూ… ఇది మిర్చి బ‌జ్జీ!

shriya-saran-ప‌విత్రతో ఓ స్వామిజీ:  నీ ద‌గ్గర‌కు నిరోధ్‌తో రాక‌పోతే రోగాలొస్తాయి – నా ద‌గ్గర‌కు రోగాల‌తో వ‌స్తారు, నేను నిరోధిస్తా.

పొలిటీషియ‌న్లతో ప‌విత్ర:  నేను నా దేహాన్ని అమ్ముకొంటున్నా – మీరు ఈ దేశాన్నే అమ్మేస్తున్నారు
రాజ‌కీయ నాయ‌కుడితో ప‌విత్ర:  శీలం లేని ఆడ‌ది సీఎమ్ కంటే ప‌వ‌ర్ ఫుల్‌…

నిజంగా ఇవి మిర్చీ బ‌జ్జీలాంటి డైలాగులే!  జ‌నార్థన మహ‌ర్షి ప‌విత్రతో ఏం చెప్పబోతున్నాడ‌నే విష‌యం ఈ సంభాష‌ణ‌ల‌తోనే అర్థమ‌వుతోంది. రాజ‌కీయ నాయ‌కులు, దొంగ స్వామీజీల‌పై ప‌విత్ర చేసే మాన‌సిక యుద్ధమిది. స్త్రీ ఔన‌త్యాన్ని చాటి చెప్పడానికి చాలామంది ర‌చ‌యిత‌లు ర‌క‌ర‌కాల మార్గాలు ఎంచుకొన్నారు. జ‌నార్థన మ‌హ‌ర్షి ఎంచుకొన్న మార్గం – ప‌విత్ర. శ్రియ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. జ‌నార్థన మ‌హ‌ర్షి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప‌విత్ర ఈనెల 7న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా గురించి జ‌నార్థన మ‌హ‌ర్షి మాట్లాడుతూ “ఇది బూతు సినిమా, పెద్దల‌కు మాత్రమే, ఆడ‌వాళ్లు చూడ‌లేరేమో అనే అపోహ ఉంది. కానీ అది నిజం కాదు. ఇది స్త్రీ ఔన‌త్యాన్ని చాటి చెప్పే చిత్రం. ఇంటిల్లిపాదీ చూడాలి. మ‌హిళ‌లు మరీ మరీ చూడాలి. స్వీట్ షాప్‌లో హాట్ కూడా దొరుకుతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. నాకు దేవ‌స్థానం తిరుప‌తి ల‌డ్డూలంటా సినిమా అయితే, ప‌విత్ర మిర్చి బ‌జ్జీలాంటి సినిమా“ అంటున్నారు.