తొలిరోజు అమ్మాయిలు అదుర్స్

bunny  సినిమా టాక్ పరంగా ” ఇద్దరంమాయిలతో ” నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ మొదటిరోజు కలెక్షన్లు దుమ్ము రెపాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ వల్లనే ఈ కలెక్షన్లు సాధ్యమైందని అల్లు శిరీష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ  సినిమామొదటిరోజున దాదాపు 12 కోట్లు వసూలు చేసిందట. ఒక్క ఆంద్ర ప్రదేశ్ లోనే 10.5 కోట్లు
కొల్లగోట్టిందట. ఇది బన్ని కేరీర్ లో ఒక రికార్డ్ అన్ కూడా శిరీష్ ట్విట్టర్ లో తెలిపాడు. శిరీష్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వసూళ్లు ఇలా వున్నాయి. నైజాం లో 6 కోట్లు. సీడెడ్ లో 1. 43 కోట్లు, ఆంధ్ర లో 3.35 కోట్లు, కర్నాటక లో 1.3 కోట్లు ఈ సినిమా వసూలు చేసింది. కేవలం బన్ని అద్భుతమైన నటన, డాన్సులు, ఫైట్లు, పూరి టేకింగ్ గొప్పతనం వల్లనే ఈ ఓపెనింగ్స్ సాధ్యమైనాయన్నది శిరీష్ అభిప్రాయం. గమ్మత్తేమిటంటే సినిమా విడుదలయిన రెండో రోజున ఈ సినిమా కేవలం 60 శాతం కలెక్షన్లు మాత్రమే సాధించిందని తెలుస్తోంది