‘బలుపు’ పాటల సందడి అదిరింది

Balupu-Movie-Audio-181గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతి హాసన్, అంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘బలుపు’. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో  హైదరాబాద్లో  విడుదలయింది. ఈ సందర్భంగా బలుపు చిత్రం  గురించి హీరో  రవితేజ మాట్లాడుతూ…  “నా స్నేహితుడు పి.వి.పి నాకు మొదట్నుంచి  మంచి సహకారాన్ని అందించారు. ఆయన మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని ఆశిస్తున్నాను. దర్శకుడు గోపి చంద్ ఈ చిత్రం కోసం చాల కష్ట పడ్డారు. అతనితో నాకు ఇది రెండవ సినిమా. ఇక  థమన్ అద్బుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. అతను నాచేత ఈరోజు డాన్స్ చేయించగలిగాడు అన్న సంఘటనను నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని” తెలిపాడు. ఈ ఆడియో లాంచ్ లో రవితేజ, శృతి మరియు అంజలి చేసిన డాన్స్ ఈ వేడుకకే హై లైట్ గా నిలిచింది. ఈ వేడుకకు దాసరి నారాయణరావు, కె.ఎల్ నారాయణ రావు, బండ్ల గణేష్, నందిని రెడ్డి, అజయ్, భీమినేని శ్రీనివాసరావు, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, స్రవంతి రవి కిషోర్, దామోదర్ ప్రసాద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.