రేపటిలోగా సంచలన ప్రకటన : జైట్లీ

Jaitleyబీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. బీసీసీఐ సభ్యుల నుంచి రాజీనామా ఒత్తిడి పెరుగుతున్నప్పటికినీ.. గతకొన్ని రోజులుగా రాజీనామా చేసేది లేదంటూ శ్రీనివాసన్ ఖరాఖండిగా చెబుతూ వస్తున్నారు. కాగా, శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ అత్యవసర సమావేశం జూన్ 8 న నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసన్ ప్రకటించారు. మరోవైపు బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ సంచలన ప్రకటన చేశారు. బీసీసీఐ వ్యవహారంలో రేపటిలోగా సంచన ప్రకటన వింటారని మీడియాతో జైట్లీ అన్నారు. దీంతో శ్రీనివాసన్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.