తెనాలి బరిలో ఏవిఎస్ ?

avs as mlaప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు ఏవీయస్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి తెనాలికి వచ్చిన ఏవిఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే.. తెనాలి నుండి పోటీచేస్తానని చెప్పారు. తాను 12 ఏళ్లుగా తెదేపాలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెదేపాలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేస్తున్న ఏవీఎస్.. అధినేత పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లను ఉత్తేజపరచిన తెలుగుదేశం పాటలను కూడా దగ్గరుండి సమకూర్చారు. గతకొన్నేళ్లుగా తన హాస్యం ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. వస్తోన్న ఏవీఎస్ ఇక మీదట ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయడానికి రెడీ అయ్యారన్నమాట !