రూపాయి @ 56.54

rupeeరూపాయి ఈ రోజు కూడా నష్టాలలోనే కొనసాగుతోంది. శుక్రవారం మరో 16 పైసల దాకా నష్టపోతూ 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 56 రూపాయిల 54 పైసల వద్ద ట్రేడవుతోంది. బంగారం దిగుమతులు భారీగా పెరిగి.. కరెంట్‌ అకౌంట్‌ లోటు ఎక్కువ కావడంతో రూపాయి కష్టకాలం వస్తోంది. గత కొద్ది రోజులుగా డాలర్‌ ఇండెక్స్‌ బలం వల్ల రూపాయి బలహీనపడింది. గడిచిన రెండు రోజులుగా డాలర్‌ ఇండెక్స్‌ ఒక పాయింట్‌కు పైగా బలహీనపడింది. అయినప్పటికీ రూపాయి బలహీనపడింది. ఇందుకు బంగారంతో పాటు ఇతర దిగుమతులు బాగా పెరగడమే కారణం.