2013-14 రాష్ట్ర ప్రణాళిక రెడీ

CM-kiranఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటల భేటీ అనంతరం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.53 వేల కోట్లు ప్రణాళిక వ్యయంగా నిర్ణయించినట్టు ప్రణాళికా సంఘం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… 2013- 14  ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రణాళిక సిద్దమైందని అన్నారు. కేంద్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర పథకాల విశిష్టతను గుర్తించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర పథకాలను ఆదర్శ పథకాలుగా ప్రణాళిక సంఘం ప్రశంసించిందని అన్నారు. బంగారు తల్లి, ఇందిరమ్మ కలలు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పథకాలు వినూత్నంగా ఉన్నాయని అహ్లువాలియా అన్నారని సీఎం తెలిపారు.