రెజ్లింగ్ నిలబడేనా..!

wrestling-indiaఒలింపిక్స్ లో భారత దేశానికి ఎక్కువ పథకాలు తెచ్చిపెట్టిన రెజ్లింగ్ ఇక మీదట ఒలంపిక్స్ లో ఉంటుందా? లేదా అనే సందిగ్దత నేటితో తొలగనుంది. ఈరోజు జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో రెజ్లింగ్ తో పాటుగా మరో 8 క్రీడల భవితవ్యం తేలనుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరగనున్న ఈ సమావేశంలో…  రెండు స్థానాల కోసం ఎనిమిది క్రీడలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇక మీదట ఒలింపిక్స్ లో  రెజ్లింగ్ ఉంటుందా… ఉండదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత రెజలర్స్ మాత్రం ఒలంపిక్స్ లో
రెజ్లింగ్ ఉంటుందనే అశాభావం వ్యక్తం చేస్తున్నారు.