విస్తరణకు ఎన్ని కష్టాలో?

cm kiranmఒక మంత్రి జైలుపాలయ్యారు. ఇద్దరు మాజీలయ్యారు. మరో ఇద్దరు తమ వంతు ఎప్పుడా అని బెంబేలు పడుతున్నారు. ముఖ్యమంత్రి టేబుల్ పై ఫైళ్లు ఫేరుకున్న మాదిరిగానే, ఆయన దగ్గర శాఖలు కూడా పేరుకుంటున్నాయి. మరోపక్క దాదాపు మూడేళ్లుగా ఎటువంటి అవకాశాలు లేక, రాజకీయ అవకాశ వాదులు, నిరాశగా నిట్టూరుస్తున్నారు. వీళ్ల సంగతి ఎలా వున్నా, ఎన్నికలు ఏడాది లోపులో జరిగే అవకాశం వున్న తరుణంలో పాలన సజావుగా సాగాల్సిన అగత్యం, అవసరం రెండూ వున్నాయి. ఈ సంగతిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాల్సి వుంది. అయితే ఎన్నికల ముందు, ఆయారాం గయారామ్ ల వ్యవహారం గుర్తెరిగి, మంత్రి పదవుల పందేరం చేయాల్సి వుంటుంది. ఇది చిన్న వ్యవహారం కాదు. పైగా ఈసారి కావాల్సిన మంత్రలు కాస్తయినా అవినీతి మరికి అంటనివారై వుండాలి. ఇటు ముఖ్యమంత్రికి, అటు పిసిసి అధ్యక్షుడికి హితులు కావాల్సి వుంది. ఈ తలకాయనొప్పులన్నింటిని అధిగమించి, మంత్రివర్గ విస్తరణ జరగాల్సి వుంది. మరి వీటన్నింటిని కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా తట్టుకుని, విస్తరణ విజయవంతంగా పూర్తి చేస్తుందో చూడాల్సి వుంది.