ఔను… నేను ప్రేమిస్తున్నా

Lakshmi-Rai-marriageఏదైనా స‌రే… ముక్కుసూటిగా మాట్లాడ‌డం ల‌క్ష్మీరాయ్ అల‌వాటు. వ్యక్తిగ‌త విష‌య‌మైనా స‌రే. ఏదీ దాచుకోదు. ఎవ‌రినైనా ప్రేమిస్తున్నారా?? అని అడిగితే.. అబ్బే అలాంటిదేం లేదు. సినిమాల‌నే ప్రేమిస్తున్నా – అని బిల్డప్పులు ఇవ్వకుండా నిజం చెప్పేసింది. ”అవును. నేను ప్రేమిస్తున్నా. కానీ అత‌నెవ‌రో చెప్పను. త్వర‌లో మీకే తెలుస్తుంది. అంత వ‌ర‌కూ ఓపిక ప‌ట్టండి. మేమిద్దరం ఈ యేడాది పెళ్లిచేసుకొందాం అనుకొన్నాం. కానీ నేను సినిమాల‌తో బిజీగా ఉన్నా. అందుకే ఇంకాస్త టైమ్ తీసుకోవాల‌ని భావిస్తున్నా. ఇంత‌కు మించి ఏం చెప్పలేను. పెళ్లికి ముందే నా చేతిలో ఉన్న సినిమాల‌న్నీ పూర్తి చేసుకొంటా..” అంటోంది.