నాగార్జున మహా జోరుగా ఉన్నారు. ‘గ్రీకువీరుడు’, ‘భాయ్’, ‘మనం’… వీటితో పాటు ‘డాలీ’ సినిమాకీ పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉందట. ఓ పాత్ర ఆండ్రియాకి దక్కే అవకాశం ఉంది. మరో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవలే నాగ్- డాలీ మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. డాలీ చెప్పిన లైన్ నాగ్ ని ఇంప్రెస్ చేసిందట. ఈ సినిమా వెంటనే పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. మరోవైపు భాయ్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకొంది. సెప్టెంబరులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.