వడదెబ్బ మరణాలపై సీఎం సీరియస్ !

cm kiranరాష్ర్టంలో భానుడి ప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఒక్క ఈరోజే భానుడి ఉగ్రరూపానికి 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులలో వడదెబ్బ బాధితులకు సరైన వైద్యం అందక మరణిస్తున్న వైనంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. చిన్నారులకు నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్సకోసం తక్షణ ప్రవేశం దొరకడం లేదంటూ వస్తోన్న వార్తలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో తక్షణం చికిత్స లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రులలో ఏర్పాట్లను పరిశీలించి తక్షణం నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య కార్యదర్శి అజయ్ సహానీని సీఎం ఆదేశించారు.