ర‌జ‌నీకి నో చెప్పద‌ట‌!

andreah‘విశ్వరూపం’ సినిమాతో ఆండ్రియా భ‌లే పాపుల‌ర్ అయ్యింది. ఇప్పుడు ‘త‌డాఖా’తో తెలుగు ప్రేక్షకుల‌కు చేరువైంది. త‌మిళంలో మంచి అవ‌కాశాలు వస్తున్నాయి. త్వర‌లో తెలుగులో నాగార్జున‌తోనూ జ‌త క‌ట్టనుంది. మ‌రిన్ని సినిమాలు చేసి తొంద‌ర‌లోనే పాపుల‌ర్ అయిపోవాల‌ని క‌ల‌లు కంటోంది ఆండ్రియా. ఆమె దృష్టి ఇప్పుడు సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ పై ప‌డింది. ర‌జ‌నీతో ఒక్క సినిమాలో అయినా చేయాల‌ని ఉంది.. అని త‌న మ‌న‌సులోని మాట బ‌ట‌య‌పెట్టింది. “నేను ర‌జ‌నీ సార్‌ కి పెద్ద ఫ్యాన్‌. ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే నో చెప్పను. నా పాత్ర ఎలా ఉన్నా ఫ‌ర్లేదు. ఒప్పేసుకొంటా. ఆ అవ‌కాశం వ‌చ్చిన రోజు ప్రపంచంలో నాకంటే అదృష్టవంతులు ఎవ‌రూ ఉండ‌రు..“ అంటోంది. మ‌రి ఆండ్రియా ర‌జ‌నీతోనూ త‌డాఖా చూపిస్తుందంటారా? వెయిట్ అండ్ సీ.