అల్లరి యాక్షన్ వాయిదా

Action-3D-audio-trak-listఅల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘యాక్షన్ 3డి’. వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మే 31 న విడుదల కావాల్సి ఈ చిత్రం జూన్ 7 కు వెళ్ళింది. కారణం బన్నీ ఇద్దరమ్మాయిలతో మే 31 కి రెడీగా వుండడంతో థియేటర్ల కొరత ఏర్పడి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ‘దూకుడు’ చిత్రం నిర్మాత అనిల్ సుంకర నిర్మించి, దర్శకత్వం వహించాడు. నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని, స్నేహ ఉల్లాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బప్పా-బప్పీలహరిలు మ్యూజిక్ అందిచారు.