మరో మెగా హీరో తో

catherineచమ్మక్ చల్లో’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది కేరళ కుట్టి కేథరీన్ త్రెసా. ఆ చిత్రం విజయం సాదించనప్పటికీ కేథరీన్ కు గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అల్లు అర్జున్ తో జతకట్టింది. కృష్ణ వంశీ, నానిల పైసా లో కూడా కేథరీనే హీరోయిన్. వరుస అవకాశాలు తో మాంచి జోరుమీద వున్న కేధరిన్ ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ తో ఆడి పాడనుంది. మిర్చి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందే సినిమాలో కేథరీన్ ఎంపిక చేశారు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు. చిత్రం కోసం ‘టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ని ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.