టీడీపీలో చేరిన మంత్రి సోదరుడు !

tdp-Signature-Collection-onరాష్ట్ర మంత్రి అహ్మదుల్లా సోదరుడు ఇనయతుల్లా నేడు (మంగళవారం) తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇనయతుల్లా తెదేపాలో చేరికతో.. తాము తలుపులు తెరిస్తే నాయకులు వెల్లువెత్తుతారన్న బాబు వ్యాఖ్యలు నిజం కానున్నట్లు తెదేపా శ్రేణులు భావిస్తున్నారు. కాగా, తెరాస బహిష్రృత నేత చాడ సురేశ్ రెడ్డి, తెరాస రాష్ర్ట కార్యదర్శి లక్ష్మారెడ్డిలు ఈరోజు బాబు తో సమావేమయ్యారు. త్వరలోనే వీరు కూడా తెదేపాలో చేరబోతున్నట్లు సమాచారం. అయితే, ఒక మంత్రిగారి సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా తెదేపాకు శుభపరిణామమేనని రాజకీయ విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు.