మూర్తి.. ఇదేం మాయ రోగమయ్యా

 

phaneesh-murthyప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఐగేట్ సీఈఓ ఫణీష్ మూర్తి లైంగిక వేధింపుల చర్యలతో మరో సారి వార్తల్లోకి వచ్చాడు. భారతీయుడైన ఫణీష్ తన కింది ఉద్యోగినితో లైంగిక సంబంధం నడుపుతున్నట్లు, వేధింపులకు పాల్పడుతున్నట్లు కంపెనీ నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. దీంతో ఫణీష్ ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ ఐగేట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఫణీష్ కు లైంగిక వేదింపు చర్యలతో పదవి కోల్పోవడం కొత్తేం కాదు. ఇది రెండోసారి. 2002లో ఫణీష్ సెక్రటరీ రేఖ తన బాస్ లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫణీష్ ఇన్ఫోసిస్ కు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఐ గేట్ లో చేరి సీఈఓ స్థాయికి చేరుకున్న ఫణీష్.. కుక్క తోక  వంకరే  అని నిరుపించుకున్నారు. సీఈఓ లాంటి ఉన్నత పదవిలో వుండి హుందాను ప్రదర్శించక పోగా తన వెకిలి చేష్టలతో తోటి ఉద్యోగిని లైంగిక వేదించి పదవిని పోగొట్టుకున్న ఫణీష్ భారతీయుడు అవడం బాధకరం.